శ్రీరామనగర్ పట్టణ సమీపంలో అంజూరి క్యాంపు రోడ్డు పక్కన వెలసిన దైవర్డ్ మినిస్ట్రీస్ ఆవరణంలో దైవర్డ్ మినిస్ట్రీస్ ....
యేసు రక్తం నీ పాపాలను కడిగెను
బద్రర్ ఎం.అనిల్ కుమార్
బళ్లారి(శ్రీరామనగర్): శ్రీరామనగర్ పట్టణ సమీపంలో అంజూరి క్యాంపు రోడ్డు పక్కన వెలసిన దైవర్డ్ మినిస్ట్రీస్ ఆవరణంలో దైవర్డ్ మినిస్ట్రీస్ 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మూడు రోజుల పాటు సీయోను పండుగను ఘనంగా నిర్వహించారు. ముఖ్య ప్రసంగీకులుగా అంతర్జాతీయ సందేశకులు ఏడబ్ల్యూఈ హైదరాబాద్ బ్రదర్ ఎం.అనిల్ కుమార్ మాట్లాడుతూ యేసు ప్రభువు ద్వారా నీవు రక్షింప బడితివి. లోక రక్షకుని రక్షణార్థం భూమిపైకి వచ్చెను, మానవాళి సంరక్షణ కోసం సమస్త పాపాలను పోగొట్టడం కోసం తన రక్తం ధారపోసిన దేవాది దేవుడు యేసుక్రీస్తు అని కొనియాడారు. యేసుకు విశ్వాసం కల్గిన బిడ్డల వలే ఉండాలని తెలిపారు. ఎన్నో యేసుక్రీస్తు సందేశాలను వివరించారు. ముఖ్య అతిథులుగా అమెరికా ఎల్షద్దాయి గ్లోబల్ మినిస్ట్రీస్ డాక్టర్ రాంసన్ ముంబ సిస్టర్ ఎస్తెరల్లా ముంబ మాట్లాడుతూ దేవుని యందు భక్తి కల్గి ఉండాలని, ప్రతి మనిషిని ప్రేమించే మనుషులు ఉండాలని తెలిపారు.
ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, తమిళనాడు, కర్ణాటకలోని పలు ప్రాంతాల నుంచి 45 వేల మంది క్రైైస్తవ భక్తులు, పాస్టర్లు పాల్గొన్నారు. అంతర్జాతీయ సందేశకులు దైవర్డ్ మినిస్ట్రీస్ డెరైక్టర్ వై.జాన్‌పాల్ ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ సీయోను పండుగలకు ఉత్తర కర్ణాటకలో అతి పెద్ద పండుగగా ఈ సీయోను పండుగలకు పేరు రావడం సంతోషకరమైన విషయం. దేవుని సువార్త తెలియచేయడమే తాము చేస్తున్న చిన్న ప్రయత్నం అని దైవర్డ్ మినిస్ట్రీస్ ఉపాధ్యక్షుడు వై.సాల్మన్‌రాజు తెలిపారు. కార్యక్రమానికి వచ్చిన భక్తులకు మూడు రోజుల పాటు ఉచిత వసతి, భోజన వ్యవస్థను కల్పించినటు ్లఅంతత్జాతీయ సందేశకులు దైవర్డ్ మినిస్ట్రీస్ డెరైక్టర్ వై.జాన్‌పాల్ తెలిపారు.