రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి | Young man killed in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

Sep 18 2013 3:27 AM | Updated on Aug 30 2018 3:56 PM

క్యాంటర్, ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో యువకుడు మృతి చెందగా మరో యువ కుడు గాయపడిన సంఘటన

కృష్ణరాజపురం, న్యూస్‌లైన్ :  క్యాంటర్, ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో యువకుడు మృతి చెందగా మరో యువ కుడు గాయపడిన సంఘటన మంగళవారం ఆవలహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బిదరహళ్లి వద్ద జరిగింది. మృతుడు రాజస్తాన్‌కు చెందిన నస్రీలాల్ (27)గా గుర్తించారు. పోలీసుల వివరాల మేరకు... నస్రీలాల్ తన స్నేహితుడితో కలిసి మారతహళ్లిలో నివాసముంటున్నారు. సాయంత్రం మేడహళ్లి సమీపంలో ఫర్నీచర్ పని ముగించుకుని బైక్‌పై ఇంటికి వస్తుండగా బిదరహ ళ్లి వద్ద మలుపు ప్రాంతంలో వేగంగా వచ్చిన క్యాంటర్ వాహనం బైక్‌ను బలంగా ఢీకొంది. దీంతో నస్రీన్ అక్కడిక్కడే మృతి చెందగా మరో వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement