ముందు వెళ్తున్న బైక్‌ను ట్యాంకర్ ఢీకొంది.
రోడ్డు ప్రమాదంలో యువకుడి సజీవదహనం
Sep 15 2017 4:26 PM | Updated on Aug 30 2018 4:15 PM
దొడ్డబళ్లాపురం: ముందు వెళ్తున్న బైక్‌ను ట్యాంకర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న యువకుడు సజీవ దహనమైన సంఘటన కర్ణాటకలోని దేవననహళ్లిలో జరిగింది. అవతి గ్రామానికి చెందిన పరమేశ్వర్(27) గురువారం రాత్రి బైక్‌పై స్వగ్రామానికి వెళ్తుండగా వెనుక నుండి వచ్చిన ట్యాంకర్ వేగంగా ఢీకొంది. దీంతో బైక్ పెట్రోల్ ట్యాంక్ పగిలి మంటలు చెలరేగాయి. దీంతో మంటల్లో చిక్కుకుని పరమేశ్వర్ సజీవదహనమయ్యాడు. విశ్వనాథపపుర పోలీసులు కేసు ననమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement