'పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలి' | world tourism day | Sakshi
Sakshi News home page

'పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలి'

Sep 27 2016 4:05 PM | Updated on Sep 4 2017 3:14 PM

తెలంగాణ ప్రజలకు పర్యాటక కేంద్రాలను పరిచయం చేసి, అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని శాసనమండలి చైర్మన్ కె. స్వామిగౌడ్ తెలిపారు.

హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు పర్యాటక కేంద్రాలను పరిచయం చేసి, అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని శాసనమండలి చైర్మన్ కె. స్వామిగౌడ్ తెలిపారు. మంగళవారం ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురష్కరించుకుని నగరంలోని రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్వామిగౌడ్ మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు, పిల్లలకు బయటి ప్రాంత విశేషాలు, వాటి గొప్పతనం తెలియజె ప్పాలని సూచించారు.
 
రెండేళ్లలోనే రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్లతో పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేపట్టిందని తెలిపారు. పర్యాటక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ మాట్లాడుతూ పర్యాటక ప్రాంతాల సందర్శనకు వెళ్లే పాఠశాల విద్యార్థులకు సబ్సిడీ ఇచ్చే విషయం పరిశీలిస్తున్నామన్నారు. పర్యాటక దినోత్సవం సందర్భంగా వివిధ అంశాల్లో తెలంగాణ రాష్ట్ర స్థాయిలో టూరిజం ఎక్సలెన్సీ అవార్డులను మంత్రి, శాసనమండలి చైర్మన్ అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement