అరుళ్‌నిధికి పెళ్లి కుదిరింది | Wedding bell for Arulnidhi | Sakshi
Sakshi News home page

అరుళ్‌నిధికి పెళ్లి కుదిరింది

Mar 4 2015 2:25 AM | Updated on Sep 2 2017 10:14 PM

అరుళ్‌నిధికి పెళ్లి కుదిరింది

అరుళ్‌నిధికి పెళ్లి కుదిరింది

యువ నటుడు డీఎంకే నేత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మనవడు ఎం.కె.తమిళరసన్ కొడుకు అయిన అరుళ్‌నిధికిపెళ్లి కుదిరింది.

 యువ నటుడు డీఎంకే నేత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మనవడు ఎం.కె.తమిళరసన్ కొడుకు అయిన అరుళ్‌నిధికిపెళ్లి కుదిరింది. చెన్నైకి చెందిన మాజీ న్యాయమూర్తి కుమార్తె కీర్తనను వివాహమాడనున్నారు. వంశం చిత్రంతో కథా నాయకుడిగా పరిచయం అయిన అరుళ్‌నిధి. ఆ తరువాత మౌన గురు, ఒరు కన్నియుం మూడు కళవానిగళుం తదితర చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం నాలు పోలీసుం నల్లా ఇరుంద ఊరుం చిత్రంలో నటిస్తున్నారు.   చెన్నైకి చెందిన పూర్వపు న్యాయమూర్తి కూతురు కీర్తనతో అరుళ్‌నిధి వివాహం నిశ్చయించారు. వీరి నిశ్చితార్థం సోమవారం రాత్రి నగరంలోని ఒక నక్షత్ర హోటల్లో జరిగింది. దీనికి కరుణానిధితోపాటు ఆయన భార్య రాజాత్తి అమ్మాళ్, కొడుకు స్టాలిన్, కూతురు కనిమొళి, అళగిరితోపాటు బంధుమిత్రులు పాల్గొన్నారు. అయితే వివాహమెప్పుడన్నది ప్రకటించలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement