ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలం బల్లెపల్లి సమీపంలోని గుట్కా తయారీ కేంద్రంపై బుధవారం విజిలెన్స్ అధికారులు దాడి చేశారు.
ఖమ్మం : ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలం బల్లెపల్లి సమీపంలోని గుట్కా తయారీ కేంద్రంపై బుధవారం విజిలెన్స్ అధికారులు దాడి చేశారు.13 మంది వ్యక్తులను అధికారులు అరెస్ట్ చేశారు. అలాగే రూ. 50 లక్షల విలువ చేసే గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. రెండు వాహనాలను సీజ్ చేశారు. అనంతరం నిందితులను పోలీసులకు అప్పగించారు. పోలీసులు వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.