
దానికైతే రెడీ అంటున్న త్రిష
ఒకప్పుడు కథానాయికల మధ్య అధికంగా అసూయ, ఈర్ష్య భావాలే కనిపించేవి. అలాంటిది ఇప్పుడు చాలా వరకు మైత్రి భావం పెరగడం ఆరోగ్యకరమైన విషయం.
ఒకప్పుడు కథానాయికల మధ్య అధికంగా అసూయ, ఈర్ష్య భావాలే కనిపించేవి. అలాంటిది ఇప్పుడు చాలా వరకు మైత్రి భావం పెరగడం ఆరోగ్యకరమైన విషయం. అసలు విషయం ఏమిటంటే నటి సమంత తన సీనియర్ నటి త్రిషకు ఒక పిలుపునిచ్చారు. దాన్ని త్రిష వెంటనే స్వీకరించడం ఆహ్వానించదగ్గ విషయం. ఇంతకు ఈ చెన్నై సుందరీమణుల మధ్య పిలుపు ఏమిటంటే, ప్రధాని పిలుపు మేరకు ఇటీవల సమంత స్వచ్ఛభారత్‌కు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్‌లో జరిగిన శుద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు. తన అభిమానులను కూడా స్వచ్ఛ భారత్‌లో పాల్గొనవలసిందిగా పిలుపునిచ్చారు.
అంతేకాదు నటి త్రిష స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాల్సిన అసవరముందని పేర్కొన్నారు. దీనికి వెంటనే త్రిష అంగీకారం తెలిపారు. దీని గురించి తన ట్విట్టర్‌లో ఆమె పోస్టు చేస్తు స్వచ్ఛ భారత్‌లో భాగస్వామ్యం కావడానికి తాను రెడీ అంటూ సమంతకు బదులిచ్చారు. త్వరలో ఈ విషయమై ఒక ప్రణాళికను సిద్ధం చేసుకొని కార్యాచరణకు సిద్ధమవుతానని వెల్లడించారు. హీరోయిన్‌గా దశాబ్దం పూర్తి చేసుకున్న త్రిష ఇప్పటికి తమిళ, తెలుగు భాషల్లో కథానాయికగానే కొనసాగడం విశేషం.
ఈ మధ్య కన్నడ చిత్ర ప్రవేశం చేసి తొలి చిత్రంతోనే విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం ఈమె నటించిన భూలోకం, ఎన్నై అరిందాల్ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అప్పాటక్కర్ చిత్రంతో పాటు మణిమారన్ దర్శకత్వంలో ఒక చిత్రం తెలుగులో బాల కృష్ణ సరసన మరో చిత్రం చేస్తు త్రిష బిజీగా ఉన్నారు. మరో విశేషమేమిటంటే తమిళంలో త్రిష, సమంత కలిసి ఒక చిత్రంలో నటించనున్నారనేది తాజా సమాచారం.