గుప్త నిధుల కోసం తవ్వకాలు


కురవి: వరంగల్ జిల్లా కురవి మండలం రాజోలు గ్రామ శివారులోని ఓ పాడుబడ్డ శివాలయంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిగాయి. గుర్తుతెలియని వ్యక్తులు శివాలయంలోని శివలింగాన్నిపెకలించి ధ్వంసం చేశారు. ఈ విషయాన్ని స్కూలుకు వెళ్తున్న బాలురు గమనించి గ్రామస్తులకు తెలియజేయడంతో వెలుగులోకి వచ్చింది. గ్రామస్తుల ఫిర్యాదుతో పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top