కల్వర్ట్‌ను ఢీకొన్న కారు: ముగ్గురి మృతి | Three killed in road accident, car hits Culvert at Ankapur | Sakshi
Sakshi News home page

కల్వర్ట్‌ను ఢీకొన్న కారు: ముగ్గురి మృతి

Oct 22 2016 8:50 AM | Updated on Jul 30 2018 1:30 PM

నిజామాబాద్‌ జిల్లాలోని అంకాపూర్‌ వద్ద కల్వర్ట్‌ను శనివారం ఉదయం ఓ కారు ఢీకొట్టింది.

నిజామాబాద్‌: నిజామాబాద్‌ జిల్లాలోని అంకాపూర్‌ వద్ద కల్వర్ట్‌ను శనివారం ఉదయం ఓ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడిక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. షిరిడీ నుంచి గోదావరిఖని వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలిసింది. మృతులు గోదావరిఖని వాసులుగా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండటంతో అత్యవసర చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement