కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు | Sakshi
Sakshi News home page

కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు

Published Sat, Dec 6 2014 10:17 PM

The allocation of the branches of the new ministers

సాక్షి, ముంబై: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా శుక్రవారం కేబినెట్, సహాయ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన బీజేపీ, శివసేన ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నేతృత్వంలోని బీజేపీ సర్కారులో  శనివారం శాఖలు కేటాయించారు. ఇందులో బీజేపీ విద్యుత్, ఇరిగేషన్, నీటి పారుదల లాంటి కీలక శాఖలను తమవద్ద ఉంచుకుని తమ మిత్రపక్షమైన శివసేనకు ప్రజా పనుల శాఖ మినహా మిగతావన్నీ ప్రాధాన్యత లేని శాఖలు అంటగట్టినట్లు స్పష్టమవుతోంది.

బీజేపీ మంత్రులకు కేటాయించిన శాఖలు:
గిరీష్ బాపట్- ఆహార, పౌర సరఫరాల శాఖ, విని యోగదారుల సంరక్షణ, శాసనసభ వ్యవహారాలు.
గిరీష్ మహాజన్- జల వనరులు
చంద్రశేఖర్ బావన్‌కులే- విద్యుత్
బబన్‌రావ్ లోణికార్- ఇరిగేషన్, పరిశుభ్రత  
రాజ్‌కుమార్ బడోలే- సామాజిక న్యాయ శాఖ, ప్రత్యేక సహాయ శాఖ
సహాయ మంత్రులకు కేటాయించిన శాఖలివే..
రామ్ షిండే- గృహ, మార్కెటింగ్, సార్వజనిక ఆరోగ్యం, పర్యాటకం
విజయ్‌కుమార్ దేశ్‌ముఖ్- పీడబ్ల్యూడీ (ప్రాజెక్టులు), రవాణ, కార్మిక, వస్త్రోద్యోగం
అంబరీష్ రాజే ఆత్రాం- గిరిజన సంక్షేమం
రంజీత్ పాటిల్- న్యాయ శాఖ
ప్రవీణ్ పోటే- ఉద్యోగ, పర్యావరణ, పీడబ్ల్యూడీ (ప్రాజెక్టులు మినహా)

శివసేనకు చెందిన మంత్రులకు కేటాయించిన శాఖలు...
దివాకర్ రావుతే- రవాణా శాఖ  
సుభాష్ దేశాయ్- పరిశ్రమలు
రాందాస్ కదం- పర్యావరణం
ఏక్‌నాథ్ షిండే- ప్రజా పనులు. (పీడబ్ల్యూడీ)
దీపక్ సావంత్- సార్వజనిక ఆరోగ్య, కుటుంబ సంక్షేమం
సహాయ మంత్రులకు కేటాయించిన శాఖలు...
సంజయ్ రాఠోడ్- రెవెన్యూ
దాదాజీ భుసే- సహకారం
విజయ్ శివ్‌తారే- జల వనరులు
దీపక్ కేసర్కర్- ఆర్థిక, గ్రామాభివృద్ధి
రవీంద్ర వాయ్‌కర్- గృహనిర్మాణ, ఉన్నత సాంకేతిక విద్య

Advertisement

తప్పక చదవండి

Advertisement