బడ్జెట్‌లో నిధుల కేటాయింపు హర్షణీయం | The allocation of funds in the budget satisfaction | Sakshi
Sakshi News home page

బడ్జెట్‌లో నిధుల కేటాయింపు హర్షణీయం

Mar 21 2016 3:38 AM | Updated on Sep 3 2017 8:12 PM

సీఎం సిద్ధరామయ్య 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో ఉప్పార సమాజాభివృద్ధికి రూ.10 .....

బళ్లారి టౌన్ : సీఎం సిద్ధరామయ్య 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో ఉప్పార సమాజాభివృద్ధికి రూ.10 కోట్లు కేటాయించడం సంతోషంగా ఉందని ఉప్పార సంఘం ప్రధాన కార్యదర్శి, కేంద్ర పరిహార సమితి అధ్యక్షుడు యు.వెంకోబ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

శ్రీభాగిరథి గురు పీఠం, శ్రీ పురుషోత్తమానందపురి స్వామి నేతృత్వంలో కర్ణాటక రాష్ట్ర ఉప్పార సంఘ పదాధికారులు ఈనెల 14న బెంగళూరులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కలిసి సముదాయ అభివృద్ధికి నిధులు కేటాయించాలని వినతి పత్రం ఇచ్చినందున, స్పందించిన సీఎం తమ సమాజాభివృద్ధికి రూ.10 కోట్లు కేటాయించారని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement