ఎయిర్‌పోర్టుల్లో తెలుగు అనౌన్స్‌మెంట్లు | telugu announcements in ap airports | Sakshi
Sakshi News home page

ఎయిర్‌పోర్టుల్లో తెలుగు అనౌన్స్‌మెంట్లు

May 25 2017 1:23 PM | Updated on Aug 18 2018 5:57 PM

ఎయిర్‌పోర్టుల్లో తెలుగు అనౌన్స్‌మెంట్లు - Sakshi

ఎయిర్‌పోర్టుల్లో తెలుగు అనౌన్స్‌మెంట్లు

ఏపీలోని అన్ని విమానాశ్రయాల్లో ఇకపై తెలుగులో అనౌన్స్‌మెంట్లు వినపడనున్నాయి.

అమరావతి: ఏపీలోని అన్ని విమానాశ్రయాల్లో ఇకపై తెలుగులో అనౌన్స్‌మెంట్లు వినపడనున్నాయి. తెలుగులో అనౌన్స్‌మెంట్స్‌ ఇచ్చేందుకు కేంద్ర విమానయాన శాఖ అంగీకారం తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరి 16 న శాసన సభ డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ధ ప్రసాద్‌ రాసిన లేఖకు సానుకూలంగా స్పందించిన కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతిరాజు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఇక రాష్ట్రంలోని కడప, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం విమానాశ్రయాల్లో.. హిందీ, ఇంగ్లీష్‌తో పాటు తెలుగులో కూడా ప్రకటనలు వినిపించనున్నాయి.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement