సీఎం కేసీఆర్ యాదగిరిగుట్టలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
యాదాద్రిలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు
Oct 19 2016 4:27 PM | Updated on Aug 14 2018 10:54 AM
యాదాద్రి: యాదాద్రిలో జరుగుతున్న అభివృద్ధి పనులను సమీక్షించేందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బుధవారం మధ్యాహ్నం యాదగిరిగుట్టకు చేరుకున్నారు. యాదగిరిగుట్టలో ఆయనకు అర్చకులు, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేసీఆర్ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులను కేసీఆర్ పరిశీలించారు. ఆయనతో పాటు మంత్రి జగదీశ్ రెడ్డి, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్సీ రాజేశ్వర్ రెడ్డి, విప్ సునీత, ఎమ్మెల్యే కిశోర్, కలెక్టర్ అనితా రామచంద్రన్ తదితరులు ఉన్నారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ భద్రతా ఏర్పాట్లు సమీక్షిస్తున్నారు.
Advertisement
Advertisement