నోట్ల రద్దు బురద మాకు అంటుతోంది: టీడీపీ ఎంపీ | tdp MP Rayapati Sambasiva Rao comments on demonetisation | Sakshi
Sakshi News home page

నోట్ల రద్దు బురద మాకు అంటుతోంది: టీడీపీ ఎంపీ

Dec 10 2016 12:57 PM | Updated on Aug 21 2018 9:33 PM

నోట్ల రద్దు బురద మాకు అంటుతోంది: టీడీపీ ఎంపీ - Sakshi

నోట్ల రద్దు బురద మాకు అంటుతోంది: టీడీపీ ఎంపీ

పెద్ద నోట్లను రద్దు చేసి మోదీ బురద అంటించుకున్నారని టీడీపీ ఎంపీ రాయపాటి అన్నారు

విజయవాడ: పెద్ద నోట్లను రద్దు చేసి ప్రధానమంత్రి నరేంద్రమోదీ బురద అంటించుకున్నారని టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు వ్యాఖ్యానించారు. ఆ బురద కడిగేందుకు చంద్రబాబు నేతృత్వంలో కమిటీ వేశారన్నారు. ఆ బురద మాకు అంటుతోందని రాయపాటి వాపోయారు. పెద్ద నోట్ల రద్దుతో ప్రజల గొంతు నొక్కారని విమర్శించారు.

నోట్ల రద్దు మూలంగా సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న రాయపాటి.. ఈ సమస్య ఎన్ని రోజులకు పరిష్కారం అవుతుందో తెలియడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. నల్లధనమంతా కాంగ్రెస్‌ వాళ్ల దగ్గరే ఉందని.. దాన్ని మార్చుకోలేకే వారు పార్లమెంట్‌ను అడ్డుకుంటున్నారని రాయపాటి విమర్శించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement