విషం తాగి టీవీ నటుడి ఆత్మహత్య | Tamil TV Actor Sai Prashanth Dies, Allegedly Drank Poison | Sakshi
Sakshi News home page

విషం తాగి టీవీ నటుడి ఆత్మహత్య

Mar 14 2016 10:57 AM | Updated on Nov 6 2018 7:56 PM

విషం తాగి టీవీ నటుడి ఆత్మహత్య - Sakshi

విషం తాగి టీవీ నటుడి ఆత్మహత్య

పాపులర్ తమిళ టీవీ నటుడు సాయి ప్రశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు.

చెన్నై: పాపులర్ తమిళ టీవీ నటుడు సాయి ప్రశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు. చెన్నైలోని  తన నివాసంలో సాయి ప్రశాంత్ డ్రింక్లో విషం కలుపుకొని తాగినట్టు పోలీసులు తెలిపారు. ఆయన  మృతదేహాన్ని పోస్ట్మార్టమ్ నిమిత్తం కిల్పాక్ మెడికల్ కాలేజీకి తరలించారు.

ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియరాలేదని, ఒంటరితనం కారణం కావచ్చని భావిస్తున్నట్టు పోలీసులు చెప్పారు. మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన సాయి ప్రశాంత్ మూడునెలల క్రితం మరో పెళ్లి చేసుకున్నాడు. వీడియో జాకీగా కెరీర్గా ప్రారంభించిన సాయి ప్రశాంత్ అన్నామలై, సెల్వీ, అరసి వంటి టీవీ సీరియళ్లలో నటించాడు. కొన్ని తమిళ సినిమాల్లో కూడా నటించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement