
విష్ణు విశాల్ సరసన తాప్సీ
ఆ మధ్య అవకాశాలకు సిఫార్సులు అవసరమే, అవి లేని కారణంగానే కావలసినంత అందం, నటించే సత్తా ఉన్న తనకు
ఆ మధ్య అవకాశాలకు సిఫార్సులు అవసరమే, అవి లేని కారణంగానే కావలసినంత అందం, నటించే సత్తా ఉన్న తనకు అవకాశాలు రావడం లేదంటూ వాపోయిన నటి తాప్సీ గోడు పరిశ్రమ ఆలకించినట్లుంది. ప్రస్తుతం ఈ అమ్మడికి చాన్సులు వరుస కడుతున్నాయి. కాంచన-2 చిత్రం విజయం కూడ తాప్సీకి కలిసొచ్చిందని చెప్పవచ్చు. వై రాజాై వె చిత్రంలో ముఖ్యపాత్రను పోషించిన ఈ ఉత్తరాది భామ ఇప్పుడు సెల్వరాఘవన్ దర్శకత్వంలో శింబు సరసన నటిస్తున్నారు. అదే విధంగా నటుడు జయ్‌కు జంటగా మరో చిత్రం చేస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో తాప్సీని మరో అవకాశం వరించింది. ఇంతకు ముందు విజయ్‌తో తుల్లాదమనం తుళ్లుమ్, అజిత్‌తో రాజా తదితర విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు ఎళిల్ ఇటీవల యువ నటుడు విక్రమ్ ప్రభు హీరోగా వెళ్లక్కార దురై చిత్రాన్ని రూపొందించారు. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. దీంతో తాజా చిత్రానికి సిద్ధం అయ్యారు. ఈ చిత్రంలో విష్ణువిశాల్ హీరోగా నటించనున్నారు. ఈయనకు జంటగా ముందుగా నటి కీర్తీసురేశ్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేయాలనుకున్నారట. అది వర్కౌట్ కాకపోవడంతో ఆ అవ కాశం నటి తాప్సీకి దక్కినట్లు సమాచారం. త్వరలో ప్రారంభం కానున్న ఈ చిత్రానికి డి ఇమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు.