తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పోలవరం భూసేకరణ స్పెషల్ సబ్‌కలెక్టరేట్ కార్యాలయ ఉద్యోగి ప్రసాద్ మంగళవారం ఏసీబీ అధికారులకు చిక్కాడు.
ఏసీబీ వలలో సీనియర్ అసిస్టెంట్
May 16 2017 4:32 PM | Updated on Aug 17 2018 12:56 PM
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పోలవరం భూసేకరణ స్పెషల్ సబ్‌కలెక్టరేట్ కార్యాలయ ఉద్యోగి ప్రసాద్ మంగళవారం ఏసీబీ అధికారులకు చిక్కాడు. జీలుగుమిల్లికి చెందిన ఓ రైతు నుంచి రూ.3 లక్షలు లంచం తీసుకుంటుండగా పోలీసులు పట్టుకున్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకంలో భాగంగా పరిహారం చెల్లించేందుకు రైతును లంచం అడగడటంతో రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు పథకం ప్రకారం రైతు నుంచి సీనియర్ అసిస్టెంట్ లంచం తీసుకుంటుండగా అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement