స్వాతంత్య్ర దినోత్సవానికి వెళ్లేందుకు రైలు ఎక్కిన ఓ 17 ఏళ్ల కళాశాల విద్యార్థిని రైలులో నుంచి పడి మృతి చెందింది. గురువారం కుంభకోణం రైల్వేస్టేషన్‌లో చోటు చేసుకున్న ఈ సంఘటన కలకలం రేపింది.
రైలు నుంచి పడి విద్యార్థిని మృతి
Aug 17 2013 12:53 AM | Updated on Sep 1 2017 9:52 PM
కొరుక్కుపేట, న్యూస్‌లైన్: స్వాతంత్య్ర దినోత్సవానికి వెళ్లేందుకు రైలు ఎక్కిన ఓ 17 ఏళ్ల కళాశాల విద్యార్థిని రైలులో నుంచి పడి మృతి చెందింది. గురువారం కుంభకోణం రైల్వేస్టేషన్‌లో చోటు చేసుకున్న ఈ సంఘటన కలకలం రేపింది. పోలీసుల కథనం మేరకు... తిరువలన్ చూలీకి చెందిన పట్టాభిరామన్ కుమార్తె పరమేశ్వరి(17) కాలేజీ చదువుతోంది.
గురువారం స్వాతంత్య్ర దినోత్సవం పండుగకు హాజరయ్యేందుకు కళాశాలకు బయలుదేరింది. రాక్‌పోర్టు ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న పరమేశ్వరి కుంభకోణం రైల్వేస్టేషన్ వద్ద అదుపు తప్పి పడిపోయింది. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. సమీపంలోని ప్రయాణికులు గాయపడిన విద్యార్థినికి మంచినీళ్లు తాగించారు. ఆస్పత్రికి తీసుకుని పోయేలోపు దారిలోనే మృతి చెందింది.
దీంతో కుంభకోణం రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ వర్షం కారణంగా రైలు దిగేందుకు ప్రయత్నిస్తున్న విద్యార్థిని పరమేశ్వరి అదుపు తప్పి జారిపడిపోయిందని పేర్కొన్నారు.
Advertisement
Advertisement