ప్రత్యేక గదికి చిన్నమ్మ | Special Room To Sasikala In Jail | Sakshi
Sakshi News home page

ప్రత్యేక గదికి చిన్నమ్మ

May 4 2017 3:53 AM | Updated on Sep 5 2017 10:19 AM

ప్రత్యేక గదికి చిన్నమ్మ

ప్రత్యేక గదికి చిన్నమ్మ

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ అలియాస్‌ చిన్నమ్మ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కేసులో నాలుగేళ్ల శిక్ష అనుభవిస్తూ బెంగళూరు పరప్పర అగ్రహారం జైలులో ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే.

కేకే.నగర్‌: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ అలియాస్‌ చిన్నమ్మ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కేసులో నాలుగేళ్ల శిక్ష అనుభవిస్తూ బెంగళూరు పరప్పర అగ్రహారం జైలులో ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. సెల్‌నెంబర్‌–2లో ఆమెతో పాటు శశి బంధువులైన ఇలవరసి ఒకే గదిలో ఉండేవారు. ప్రస్తుతం శశికళ 2వ సెల్‌ నుంచి 4వ నెంబరు సెల్‌కు మారారు. జైలుకు వచ్చిన కొత్తలో ఆమెను కలవడానికి పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు వచ్చేవారు.

వారిని కలవడానికి వెలుపలకు వచ్చిన సమయంలో అదనపు భద్రత ఏర్పాటు చేయాల్సిఉండేది. దాన్ని నియంత్రించే దిశగా ఆమెను వేరే గదికి మార్చి నట్టు తెలుస్తోంది. కొత్త గదిలో శశికళకు పడక, కుర్చీ, టీవీ సౌకర్యం కల్పించారు. దోమల బెడద ఎక్కువగా ఉండడంతో ఆమె దోమతెర వాడుతున్నారు. రోజూ  ఆమె దినపత్రికలు చదివి సమాచారం తెలుసుకోవడంలో ఆసక్తి చూపుతున్నారు. అనంతరం టీవీలో జయలలిత నటించిన పాత సినిమాలను చూసి కాలక్షేపం చేస్తున్నారని జైలు అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement