స్నూపీ.. నువ్వు సూపర్‌.. | snoopi.. you are super.. | Sakshi
Sakshi News home page

స్నూపీ.. నువ్వు సూపర్‌..

Oct 2 2016 8:55 AM | Updated on Sep 29 2018 4:26 PM

స్నూపీ.. నువ్వు సూపర్‌.. - Sakshi

స్నూపీ.. నువ్వు సూపర్‌..

విశ్వాసం చూపడంలో ముందుండే కుక్క జాతి.. మరో ముందడుగు వేసింది.

జంగారెడ్డిగూడెం : విశ్వాసం చూపడంలో ముందుండే కుక్క జాతి.. మరో ముందడుగు వేసింది. తోటి కుక్కకు రక్తాన్ని దానం చేసి ప్రాణాలను కాపాడింది. వివరాల్లోకి వెళ్తే, జంగారెడ్డిగూడానికి చెందిన కోటగిరి ప్రమీలకు చెందిన కుక్క పేరు బాలు. కొంతకాలంగా ఇది రక్తహీనతతో బాధపడుతోంది. హిమోగ్లోబిన్‌ 4 శాతానికి పడిపోయింది.

విషయం తెలుసుకున్న స్థానిక శ్రీనివాసపురానికి చెందిన తానిగడప బద్దారావు తన పెంపుడు కుక్క స్నూపీ నుంచి రక్తాన్ని సేకరించడానికి అంగీకరించారు. స్థానిక పశువైద్యాధికారి డాక్టర్‌ బీఆర్‌ శ్రీనివాసన్‌ స్నూపీ నుంచి 350 మి.లీ. రక్తాన్ని సేకరించి శనివారం కుక్క బాలుకు ఎక్కించారు. ప్రస్తుతం బాలు ఆరోగ్యంగా ఉందని డాక్టర్‌ చెప్పారు. స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం రోజునే ఈ ఘటన చోటు చేసుకోవడం విశేషం. 
 

Advertisement
 
Advertisement
Advertisement