రూ. 20 లక్షలు సాయం ప్రకటించిన నటి | sneha donate to rs 20 lakh to farmers | Sakshi
Sakshi News home page

రూ. 20 లక్షలు సాయం ప్రకటించిన నటి

Apr 23 2017 8:18 PM | Updated on Aug 13 2018 4:19 PM

రూ. 20 లక్షలు సాయం ప్రకటించిన నటి - Sakshi

రూ. 20 లక్షలు సాయం ప్రకటించిన నటి

తమిళ రైతులకు నటి స్నేహ దంపతులు రూ. 20 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు.

టీనగర్‌(చెన్నై): ఢిల్లీలో ఆందోళన చేపట్టిన పదిమంది తమిళ రైతులకు నటి స్నేహ దంపతులు రూ. 20 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ 41 రోజులుగా ఢిల్లీలో జంతర్‌మంతర్‌ వద్ద తమిళ రైతులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆదివారం వారు తాత్కాలికంగా తమ ఆందోళనను విరమించారు.

ఢిల్లీ ఆందోళనలో పాల్గొన్న పదిమంది రైతులకు రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. వారు ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తమిళనాట నెలకొన్న కరువు పరిస్థితుల కారణంగా రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమన్నారు. రైతులకు తమకు తోచిన సాయం అందజేసేందుకు ముందుకొచ్చినట్లు తెలిపారు. అలాగే అన్ని వర్గాలవారు రైతులను ఆదుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement