
శివకార్తికేయన్‌తో శ్రుతి సై అంటుందా?
శ్రుతిహాసన్ స్మార్టే కాదు చాలా హాట్ కూడా. ఈ క్రేజీ హీరోయిన్‌తో జత కట్టాలని స్టార్ హీరోలే కోరుకుంటున్నారు. ఇక శివకార్తికేయన్ లాంటి యువ
శ్రుతిహాసన్ స్మార్టే కాదు చాలా హాట్ కూడా. ఈ క్రేజీ హీరోయిన్‌తో జత కట్టాలని స్టార్ హీరోలే కోరుకుంటున్నారు. ఇక శివకార్తికేయన్ లాంటి యువ హీరోలు ఆశ పడడంలో ఆశ్చర్యం ఏముంటుంది. ఉంటే గింటే ఈ బ్యూటీ వీళ్లతో జత కట్టడారికి సై అంటేనే. అవును శ్రుతిహాసన్ ఇప్పుడు ఏ ఒక్క భాషకో పరిమితమైన నటి కాదు. తమిళం,తెలుగు,హింది అంటూ బహు భాషల్లో టాప్ హీరోయిన్‌గా విరాజిల్లుతున్నారు. ప్రస్తుతం భారీ అంచనాలతో విడుదలకు సిద్ధం అవుతున్న విజయ్‌తో నటించిన పులి చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు.అలాగే మరో స్టార్ హీరో అజిత్‌కు జంటగా నటిస్తున్నారు.
త్వరలో ఇంకో స్టార్ హీరో సూర్య సరసన సింగం-3లో నటించడానికి సిద్ధం అవుతున్నారు. హిందీలోనూ జాన్ అబ్రహంతో రాఖీ హ్యండ్‌సమ్ చిత్రంలో నటిస్తున్నారు. ఇలా మూడు భాషల్లోనూ నటిస్తూ యమ బిజీగా ఉన్న ఈ క్రేజీ బ్యూటీతో జత కట్టాలని యువ నటుడు శివకార్తికేయన్ ఆశ పడుతున్నారు. వరుస విజయాలతో కథానాయకుడిగా తన స్థాయిని పెంచుకుంటూ పోతున్న శివకార్తికేయన్ రజనీ మురుగన్ చిత్రం విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. కాగా తదుపరి చిత్రానికి సిద్ధమయ్యారు. నవ దర్శకుడు భాగ్యరాజ్ కన్నన్ దర్శక కెప్టెన్సీ బాధ్యతల్ని చేపడుతున్న ఈ చితానికి సాంకేతిక పరంగా ప్రముఖ నిపుణుల్ని ఎంపిక చేసుకుంటున్నారు.
చాయాగ్రహణం పీసీ.శీరామ్.సంగీతాన్ని అనిరుద్, మేకప్ బాధ్యతల్ని హాలీవుడ్ మేకప్‌మ్యాన్ సీన్ ఫూట్ నిర్వహించనున్నారు. ఇక పోతే కథానాయకి పాత్రకు కూడా స్టార్ ఇమేజ్ ఉన్న నటిని ఎంపిక చెయ్యాలని భావిస్తున్నారు. ఇంతకు ముందు సమంత, షామిలి పేర్లు పరిశీలనలో ఉన్నాయి.తాజాగా గ్లామరస్ ప్లస్ స్టార్ హీరోయిన్ శ్రుతిహాసన్‌పై దృష్టి మళ్లించారు. ఈ బ్యూటీతో ఇప్పటికే సంప్రదింపులు జరుగుతున్నాయి. శ్రుతి సై అనడమే తరువాయి షూటింగ్ స్టార్ట్ అన్నట్లుగా చిత్ర యూనిట్ పరిస్థితి. అయితే ఆమె ఓకే అంటారా? అన్నదే ఆసక్తిగా మారింది. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రాన్ని శివకార్తికేయన్ మిత్రుడు ఆర్‌డి.రాజా భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు.