ఒంగోలులో నయీం ఆస్తులు?
ఏపీలో గ్యాంగ్ స్టర్ నయీం లింకులపై తెలంగాణ సిట్ విచారణ చేపడుతోంది.
-నయీం సన్నిహితుడి ఇంట్లో సోదాలు
ఒంగోలు : ఏపీలో గ్యాంగ్ స్టర్ నయీం దందాలపై తెలంగాణ సిట్ విచారణ చేపడుతోంది. ప్రకాశం జిల్లా ఒంగోలులో నయీం సన్నిహిత బంధువు ఏ2 నిందితుడు సలీమ్ అలియాస్ ఫహీం ఇంట్లో సిట్ బృందం సోదాలు చేసింది. స్థానిక పోలీసుల సమక్షంలో ఫ్లాట్‌లో సోదాలు చేసిన సిట్ విలువైన డ్యాక్యుమెంట్స్‌ను స్వాధీనం చేసుకుంది. సలీంపేరుతో చెలామణి అయిన ఫహీం ఒంగోలులో ఏడాదిన్నర పాటు నివాసం ఉంటున్నట్లు తెలిసింది. నయీం ఎన్‌కౌంటర్‌కు 10 రోజుల ముందే నుంచి ఫహీం కనిపించకుండా పోయాడని స్థానికులు చెబుతున్నారు. నయీం అరాచకం ఒంగోలులోనూ వెలుగుచూడటంతో ఒంగోలులో కలకలం రేగుతోంది.