ఎస్‌ఐ భార్య మెడలో చైన్ స్నాచింగ్ | SI's wife gold chain snatched in chennai | Sakshi
Sakshi News home page

ఎస్‌ఐ భార్య మెడలో చైన్ స్నాచింగ్

Mar 12 2016 8:48 AM | Updated on Sep 3 2017 7:35 PM

ఎస్‌ఐ భార్య మెడలో చైన్ స్నాచింగ్

ఎస్‌ఐ భార్య మెడలో చైన్ స్నాచింగ్

మాధవరంలో ఎస్‌ఐ భార్య మెడలో దుండగులు చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డారు.

టీనగర్ : మాధవరంలో ఎస్‌ఐ భార్య మెడలో దుండగులు చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డారు. ఎన్నూరుకు చెందిన భూపతి. తండయార్‌పేటలో స్పెషల్ ఎస్‌ఐగా పనిచేస్తున్నారు. ఇతని భార్య సంగీత (40). గురువారం భూపతి, సంగీత బైకులో అంబత్తూరులోగల బంధువు ఇంటికి వెళ్లి రాత్రి తొమ్మిది గంటల సమయంలో తిరిగి వస్తున్నారు.

మాధవరం సమీపంలోగల మంజంబాక్కం వద్ద వస్తుండగా బైకులో వెనుక వస్తున్న దుండగులు హఠాత్తుగా సంగీత మెడలో ఉన్న ఏడు సవర్ల బంగారు చైన్‌ను లాగేందుకు ప్రయత్నించారు. వెంటనే సంగీత గొలుసును గట్టిగా పట్టుకుని అడ్డుకుంది. దీంతో దుండగుడి చేతికి నాలుగు సవర్ల బంగారు నగ  చిక్కింది.

ఈ నగతో దుండుగులు పారిపోయారు. వారి కోసం ఎస్‌ఐ భూపతి వెంట బడ్డాడు. అయినప్పటికీ వారు పట్టుబడలేదు. చోరీకి గురైన నగ విలువ ఎనభై వేల రూపాయని బాధితురాలు పేర్కొంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement