తొలిజాబితాలో మొత్తం 15 మంది అభ్యర్థులను ప్రకటించగా వీరిలో ఊహించినట్టుగానే శివసేన సీనియర్ నాయకుడు మనోహర్ జోషీకి బదులు రాహుల్ శెవాలేను దక్షిణ మధ్య ముంబై నుంచి అభ్యర్థిగా ప్రకటించారు.
సాక్షి, ముంబై: శివసేన లోకసభ అభ్యర్థుల తొలి జాబితాను శుక్రవారం ప్రకటించింది. తొలిజాబితాలో మొత్తం 15 మంది అభ్యర్థులను ప్రకటించగా వీరిలో ఊహించినట్టుగానే శివసేన సీనియర్ నాయకుడు మనోహర్ జోషీకి బదులు రాహుల్ శెవాలేను దక్షిణ మధ్య ముంబై నుంచి అభ్యర్థిగా ప్రకటించారు. దాదర్‌లోని శివసేన ప్రధాన కార్యాలయంలో శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఈ జాబితాను ప్రకటించారు. గురువారం ఎన్సీపీతోపాటు బీజేపీ తమ తొలిజాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే.
వీరు ప్రకటించిన మరుసటి రోజునే శివసేన కూడా తమ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల శంఖారావం పూరించిందని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా మహాకూటమిలో మిత్రపక్షాలైన స్వాభిమానీ శేత్కారీ సంఘటన కోసం శివసేన హాతకణంగలే నియోజకవర్గం, రిపబ్లికన్ పార్టీ (ఆర్పీఐ) కోసం సాంగ్లీ నియోజకవర్గాన్ని కేటాయించింది. కాగా, మిగతా అభ్యర్థుల జాబితాను కూడా తొందర్లోనే ప్రకటిస్తామని ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు.
అభ్యర్థుల వివరాలివే..
బుల్డాణా : ప్రతాపరావ్ జాధవ్
రాంటెక్: కృపాల్ తుమానే
అమరావతి: ఆనంద్‌రావ్ అడసూల్
యావత్మాల్-వాషీం: భావనా గవలీ
హింగోళి : సుభాష్ వాంఖేడే
పర్భణీ: సంజయ్ జాధవ్ (బండు)
ఔరంగాబాద్: చంద్రకాంత్ శిందే
కళ్యాణ్: శ్రీకాంత్ షిందే
ఠాణే: రాజన్ విచారే
వాయివ్య ముంబై : గజానన్ కీర్తికర్
దక్షిణ ముంబై: అరవింద్ సావంత్
దక్షిణమధ్య ముంబై : రాహుల్ శెవాలే
రాయిగఢ్ : అనంత్ గీతే
శిరూర్ : శివాజీరావ్ ఆడలరావ్- పాటిల్,
రత్నగిరి-సింధుదుర్గా : వినాయక్ రావుత్