నగరంలో రివాల్వర్‌తో బెదిరించి రూ. 40 లక్షల విలువైన నగలు, రూ. ఆరు లక్షల నగదు లూటీ చేసిన సంఘటన చోటు చేసుకుంది.
బెంగళూరు: నగరంలో రివాల్వర్‌తో బెదిరించి రూ. 40 లక్షల విలువైన నగలు, రూ. ఆరు లక్షల నగదు లూటీ చేసిన సంఘటన ఇక్కడి హలసూరు గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు... శనివారం సాయంత్రం ఇక్కడి నగర్తపేటలో రోహిణి డైమండ్స్ యజమాని రూ. 40 లక్షల విలువైన ఆభరణాలు, 6 లక్షల నగదు తీసుకుని స్కూటర్‌లో బయలుదేరారు.
నగర్త పేట సమీపంలో ముగ్గురు దుండగులు వాహనాన్ని అడ్డగించారు. అన ంతరం రివాల్వర్‌తో బెదిరించి బంగారు, నగదుతో ఉడాయించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. తెలిసిన వారి పనే అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.