పేరుకే డివిజన్‌

పేరుకే డివిజన్‌

నెల రోజులైనా ఏర్పాటుకాని కార్యాలయాలు 

ఇన్ చార్జి ఆర్డీఓ, ఇన్ చార్జి డీఎస్పీతో పాలన

మిగతా శాఖల అధికారుల నియామకంపై ఊసెత్తని ప్రభుత్వం 

మండలాల్లో కాని పనుల కోసం

జిల్లా కేంద్రానికి వెళుతున్న ప్రజలు  

 

తొర్రూరు : పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజనలో భాగంగా కేసీఆర్‌ ప్రభుత్వం కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా కొత్తగా ఏర్పడిన మహబూబాబాద్‌ జిల్లాలో తొర్రూరును రెవెన్యూ డివిజన్‌గా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఆర్డీఓ, డీఎస్పీ, రిజిషే్టష్రన్, ఎస్‌టీఓ, ఫైర్‌స్టేçÙన్, పోస్టుమార్టం ఆస్పత్రి, 50 పడకల ప్రభుత్వ ఆస్పత్రి, ఆర్‌అండ్‌బీ, ఆర్‌డబ్ల్యూఎస్, చిన్నతరహా, భారీ నీటి పారుదల, విద్యా, వైద్య, వ్యవసాయ, విద్యుత్, హర్టీకల్చర్, ఐసీడీఎస్, ఐకేపీ, డీఆర్‌డీఏ, లేబర్, డీఎల్‌పీఓ, ఆర్టీఏ, మత్య్క పారిశ్రామిక, ఎక్సైజ్, సివిల్‌ సప్లై, విజిలెన్స్, పశు వైద్య వంటి అన్నిశాఖల డివిజన్‌ స్థాయి కార్యాలయాలు ఏర్పాటవుతాయని, తద్వారా అన్నిశాఖల సేవలు అందుబాటులోకి వస్తాయని  ఎంతో ఆశతో ప్రజలు ఎదురు చూశారు. రెవెన్యూ డివిజన్ ఏర్పాటుతో అన్నివర్గాల ప్రజలు సంబురాలు జరుపుకున్నారు. అయితే డివిజన్ ఏర్పాటై నెల రోజులు గడుస్తున్నా కేవలం ఆర్డీఓ కార్యాలయం, డీఎస్పీ కార్యాలయాల ప్రారంభం తప్ప, ఇప్పటికి  సుమారు ముప్పై శాఖల్లో ఏ ఒక్కశాఖ కార్యాలయాన్ని కుడా ప్రారంభించిన దాఖాలాలు లేవు. 

 

ప్రారంభించిన కార్యాలయాల్లో పరిపాలన శూన్యం ..

తొర్రూరులో ఏర్పాటు చేసిన ఆర్డీఓ కార్యాలయాన్ని ప్రారంభించి, ఇన్ చార్జ్‌ ఆర్డీఓను నియమించినప్పటికి ఆయా మండలాలకు చెందిన సంబంధిత ఫైల్స్‌ ఇంకా రాకపోవడంతో ఆర్డీఓ సేవలు ఇంకా పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు. అంతేకాకుండా డీఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించి, ఇన్ చార్జ్‌ డీఎస్పీని నియమించినప్పటికి ఇప్పటి వరకు ఏ ఒక్కరోజు కూడా సంబంధత డీఎస్పీ కార్యాలయాన్ని తెరిచిన దాఖలాలు లేవు. నూతనంగా ఏర్పడిన జిల్లాలో నెలరోజులు గడుస్తున్నా పరిపాలన సాగకపోవడంతో అసలు కొత్త కార్యాలయాల పాలన ఉంటుందో, ఉండదోనని ఈ ప్రాంతానికి చెందిన ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రెవెన్యూ డివిజన్ లో ఉండే ప్రతి కార్యాలయాన్ని వెంటనే ప్రారంభించాలని స్థానికులు కోరుతున్నారు.

 
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top