రూపాయికే ఇడ్లీ | Re Chocolate | Sakshi
Sakshi News home page

రూపాయికే ఇడ్లీ

Feb 17 2014 2:09 AM | Updated on May 28 2018 4:09 PM

స్థానిక కళాసిపాళ్యలోని నాగేశ్వరగార్డన్‌లో ‘అమ్మమెస్’ను అన్నా డీఎంకే రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు కే.ఆర్ కృష్ణరాజు ఆదివారం ఉదయం లాంఛనంగా ప్రారంభించారు.

బెంగళూరులో అమ్మ క్యాంటీన్  
 
సాక్షి, బెంగళూరు : స్థానిక కళాసిపాళ్యలోని నాగేశ్వరగార్డన్‌లో ‘అమ్మమెస్’ను అన్నా డీఎంకే రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు కే.ఆర్ కృష్ణరాజు ఆదివారం ఉదయం లాంఛనంగా ప్రారంభించారు. ఇకపై ప్రతి ఆదివారం ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకూ రూపాయికి ఒక ఇడ్లీ చొప్పున అమ్మమెస్‌లో విక్రయిస్తారు. నెల రోజుల తర్వాత ఈ సౌకర్యం అందుబాటులోకి తీసుకురానున్నారు. కాగా, రాష్ట్రంలోని పేదలకు పౌష్టికాహారాన్ని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటువంటి చౌకధరల క్యాంటీన్లను ప్రారంభించాలని కృష్ణరాజు పేర్కొన్నారు.
 
ఈ విషయమై ఈనెల 23న ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కలిసి వినితిపత్రం అందిస్తామన్నారు. కాగా, తమిళనాడులో ముఖ్యమంత్రి జయలలిత ప్రారంభించిన అమ్మమెస్‌లు దేశవ్యాప్తంగా ప్రాచూర్యం పొందిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement