తిరుమలలో వైభవంగా రథ సప్తమి | Ratha Saptami Celebrations in Tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో వైభవంగా రథ సప్తమి

Feb 3 2017 2:50 PM | Updated on Sep 5 2017 2:49 AM

తిరుమలలో వైభవంగా రథ సప్తమి

తిరుమలలో వైభవంగా రథ సప్తమి

తిరుమలలో రధసప్తమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి.

తిరుమల: తిరుమలలో రధసప్తమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. సూర్యోదయం నుంచి మధ్యాహ్నం వరకు సూర్యప్రభ, చిన్న శేష, గరుడ వాహనాలపై మలయప్ప స్వామి తిరువీదుల్లో ఊరేగారు. ఇపుడు హనుమంత వాహనంపై ఊరేగింపు కొనసాగుతోంది. తరువాత శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నాన మహోత్సవం నిర్వహించనున్నారు. సాయంత్రం కల్పవృక్ష వాహనం, రాత్రి 8 గంటలకు చంద్ర ప్రభ వాహనంపై శ్రీవారు ఊరేగనున్నారు. ఒక్క రోజు బ్రహ్మోత్సవానికి భక్తులు భారీగా తరలివచ్చారు. రథ సప్తమి రోజున ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా భక్తులు లెక్కచేయకుండా తిరువీధుల్లో స్వామి వారి ఊరేగింపును తిలకిస్తున్నారు. ఇవాళ, రేపు ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement