శరవేగంగా తిరునాళ్ | Rapidly Thirunal | Sakshi
Sakshi News home page

శరవేగంగా తిరునాళ్

Jun 17 2015 2:55 AM | Updated on Sep 3 2017 3:50 AM

శరవేగంగా తిరునాళ్

శరవేగంగా తిరునాళ్

జీవా, నయనతారల తిరునాళ్ (ఉత్సవం) శరవేగంగా, కోలాహలంగాను జరుగుతోంది. ‘ఈ’ వంటి విజయవంతమైన చిత్రం తరువాత

జీవా, నయనతారల తిరునాళ్ (ఉత్సవం) శరవేగంగా, కోలాహలంగాను జరుగుతోంది. ‘ఈ’ వంటి విజయవంతమైన చిత్రం తరువాత జీవా, నయనతార జంటగా నటిస్తున్న చిత్రం తిరునాళ్. పీఎస్ రామనాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కోదండపాణి ఫిలింస్ పతాకంపై ఎం.సెంథిల్‌కుమార్ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ తిరునాళ్ చిత్ర షూటింగ్ కుంభకోణంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

ఇందులో జీవా పల్లెటూరి మొరటోడిగా నటిస్తున్నారని, నయనతార కూడా చాలాకాలం తరువాత గ్రామీణ యువతిగా నటిస్తున్నారని తెలిపారు. చిత్రం కోసం కుంభకోణంలో బ్రహ్మాండమైన సెట్‌ను వేసి నిత్యం వెయ్యిమందికి పైగా సహాయ నటీనటులతో ప్రధానపాత్రలో నటించే కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు వెల్లడించారు. దీనికి శ్రీ సంగీతాన్ని, మహేముత్తుస్వామి చాయాగ్రహణం అందిస్తున్నారని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement