శ్రుతిపై వదంతులు వద్దు | Producers of `Puli` support Shruti Hassan! | Sakshi
Sakshi News home page

శ్రుతిపై వదంతులు వద్దు

Apr 2 2015 2:29 AM | Updated on Jul 15 2019 9:21 PM

శ్రుతిపై వదంతులు వద్దు - Sakshi

శ్రుతిపై వదంతులు వద్దు

నటి శ్రుతిహాసన్‌పై వదంతులు ప్రచారం చేయకూడదంటూ పులి చిత్ర నిర్మాత పీటీ సెల్వకుమార్ అభ్యర్థించారు.

 నటి శ్రుతిహాసన్‌పై వదంతులు ప్రచారం చేయకూడదంటూ పులి చిత్ర నిర్మాత పీటీ సెల్వకుమార్ అభ్యర్థించారు. నాగార్జున, కార్తీ కలసి నటిస్తున్న కొత్త చిత్రం నుంచి వైదొలగిన శ్రుతిహాసన్ గురించి రోజుకో రకంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఆమె ప్రస్తుతం విజయ్ సరసన పులి చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాత సెల్వకుమార్ బుధవారం మధ్యాహ్నం చెన్నైలో విలేకరులతో మాట్లాడుతూ పీవీపీ సినిమా సంస్థ నాగార్జున, కార్తీ హీరోలుగా నటిస్తున్న తాజా చిత్రం నుంచి వైదొలగిన శ్రుతిహాసన్‌కు వ్యతిరేకంగా ఆ సంస్థ పలు చర్యలు తీసుకుంటోంది.
 
  శ్రుతి ఆ చిత్రంలో నటించకుండా వేరే కొత్త చిత్రం ఒప్పుకుని నటించడానికి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. నిజానికి తమ సంస్థ విజయ్ హీరోగా నిర్మిస్తున్న చిత్రంలో శ్రుతి, హన్సిక, శ్రీదేవి, సుదీప్ నటిస్తున్నారు. శ్రుతి మా చిత్రం కోసం ఏప్రిల్ ఒకటి నుంచి 15వ తారీఖు వరకు కాల్‌షీట్స్ కేటాయిం చారు. ప్రస్తుతం పులి చిత్రం తలకోనలో నిర్వహిస్తున్నాం. ఈ చిత్రం కోసం 150 మంది రెండు నెలలుగా శ్రమించి కళా దర్శకుడు ముత్తురాజ్ నేతృత్వంలో బ్రహ్మాండమైన సెట్‌ను వేశాం. ఈ సెట్‌లో ఈ నెలలో షూటింగ్ చేయకపోతే మేలో పర్యాటకులు రాక ఎక్కువ కావడంతో ఆ సెట్‌ను కూల్చేయాల్సి ఉంటుంది. శుృతిహాసన్ చివరి దశలో చిత్రం ఆగిపోకూడదని పులి చిత్రాన్ని పూర్తి చేయడానికి సహకరిస్తున్నారు. అంతేకాని ఆమె వేరే కొత్త చిత్రంలో నటించడం లేదని వివరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement