ఇద్దరు భామలతో విక్రమ్ రొమాన్స్ | Priya Anand and Kajal Aggarwal to romance Vikram | Sakshi
Sakshi News home page

ఇద్దరు భామలతో విక్రమ్ రొమాన్స్

Jun 2 2015 2:39 AM | Updated on Sep 3 2017 3:03 AM

ఇద్దరు భామలతో విక్రమ్ రొమాన్స్

ఇద్దరు భామలతో విక్రమ్ రొమాన్స్

నటుడు విక్రమ్ ఇద్దరు హీరోయిన్లతో నటించి చాలా కాలమైంది. ఆ మద్య ధూళ్ చిత్రంతో జ్యోతిక, రిమాసేన్‌లతో రొమాన్స్

 నటుడు విక్రమ్ ఇద్దరు హీరోయిన్లతో నటించి చాలా కాలమైంది. ఆ మద్య ధూళ్ చిత్రంతో జ్యోతిక, రిమాసేన్‌లతో రొమాన్స్ చేశారు. తాజాగా మరోసారి ఇద్దరు భామలతో యువళ గీతాలు పాడడానికి సిద్ధం అవుతున్నారు. విక్రమ్ ఐ వంటి సక్సెస్‌ఫుల్ చిత్రం తరువాత విజయ్‌మిల్టన్ దర్శకత్వంలో పత్తు ఎండ్రదుక్కుల్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి. తదుపరి విక్రమ్, గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో నటించనున్నారనే ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. తాజాగా విక్రమ్ యువ దర్శకులపై దృష్టి సారించారు. ఇద్దరు యువ దర్శకులకు పచ్చ జెండా ఊపారు.
 
 అందులో ఒకరు ఆనంద్‌శంకర్. ఈయన ఇంతకు ముందు విక్రమ్‌ప్రభు హీరోగా అరిమానంబి చిత్రన్ని తెరకెక్కించారన్నది గమనార్హ్హం. ఈయన ఇప్పుడు విక్రమ్‌ను డెరైక్ట్ చేయనున్నారు. ఇందులో ఇద్దరు బ్యూటీస్‌తో రొమాన్స్ చేయనున్నారు. అందులో ఒకరు కాజల్‌అగర్వాల్ కాగా మరొకరు ప్రియాఆనంద్. కాగా విక్రమ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన మరో యువ దర్శకుడి పేరు అమిద్. ఈయన తొలి చిత్రం రాజతందిరం. ఎలాంటి అంచనాలు లేకుండా తెరపైకొచ్చిన ఈచిత్రం మంచి విజయాన్ని సాధించింది. దీంతో అమిద్ కిప్పుడు విక్రమ్‌తో పని చేసే అవకాశం వచ్చిందని సమాచారం. ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీత బాణీలు కట్టనున్నట్టు తెలిసింది. అయితే విక్రమ్ ముందు ఆనంద్ శంకర్ చిత్రాన్ని పూర్తి చేసి ఆ తరువాత అమిద్ చిత్రం చేస్తారని తెలిసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement