తిరుమలలో పోలీసుల ఓవరాక్షన్
తిరుమలలో పోలీసుల అత్యుత్సాహం వల్ల భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తిరుమల: తిరుమలలో పోలీసుల అత్యుత్సాహం వల్ల భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మాడవీధుల్లోకి భక్తులను అనుమతించకపోవడంతో.. పలు చోట్ల భక్తులు పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. భద్రత పేరుతో భక్తులను రింగ్ రోడ్డు చుట్టూ తిప్పుతూ.. ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఇప్పటికే శ్రీవారి బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు సుమారు 3 లక్షల మంది భక్తులు తిరుమలకు చేరుకున్నారు. ప్రస్తుతం స్వామివారి దర్శనానికి కంపార్ట్‌మెంట్లన్ని నిండి వెలుపల క్యూలైన్లో భక్తులు వేచి ఉన్నారు. క్యూలైన్లో వేచి ఉన్న భక్తులకు కనీసం నీరు కూడా అందించని టీటీడీ అధికారుల తీరుపై భక్తులు మండి పడుతున్నారు. సాయంత్రానికి మరో లక్షమందికి పైగా తిరుమలకు చేరుకునే అవకాశం ఉంది.