‘మా పాలనలో రైతు ఆత్మహత్యలు తగ్గాయి’ | pocharam srinivas reddy slams tdp, congress over farmers suicides | Sakshi
Sakshi News home page

‘మా పాలనలో రైతు ఆత్మహత్యలు తగ్గాయి’

Nov 7 2016 1:07 PM | Updated on Oct 1 2018 2:09 PM

టీఆర్‌ఎస్ హయాంలో రైతు ఆత్మహత్యలు తగ్గాయని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

కామారెడ్డి: టీఆర్‌ఎస్ హయాంలో రైతు ఆత్మహత్యలు తగ్గాయని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాబోయే ఐదేళ్లలో కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. రైతు రుణాలను 75 శాతం వరకూ చెల్లించామని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ హయాంలో 10 వేల మంది రైతులు, కాంగ్రెస్ హయాంలో 12 వేల 500 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. ఆంధ్రాలో కనీసం 45 శాతం రుణాలను కూడా చెల్లించని టీడీపీకి మాట్లాడే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. నకిలీ విత్తనాల సరఫరాపై నేరుగా మేనేజింగ్ డైరెక్టర్ల పైనే కేసులు నమోదు చేశామన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement