మెరుగుపడుతున్న సంజనా ఆరోగ్యం | Peddambarpet Accident : Sanjana's Health Improves | Sakshi
Sakshi News home page

మెరుగుపడుతున్న సంజనా ఆరోగ్యం

Oct 13 2016 10:55 AM | Updated on Sep 4 2017 5:05 PM

రోడ్డు ప్రమాదంలో గాయపడిన చిన్నారి సంజనా ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుందని కామినేని వైద్యులు వెల్లడించారు.

హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో గాయపడిన చిన్నారి సంజనా ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుందని కామినేని వైద్యులు గురువారం వెల్లడించారు. ఆమెకు వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయని తెలిపారు. అయితే ఈ ప్రమాదానికి కారణమైన ముగ్గురు నిందితులకు బెయిల్ రద్దు చేయాలని సంజనా తల్లిదండ్రులు గురువారం హయత్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్టోబర్ 2వ తేదీన పెద్ద అంబర్పేట వద్ద రోడ్డు దాటుతున్న సంజనతోపాటు ఆమె తల్లిని తాగి వాహనం నడుపుతున్న యువకులు ఢీకొట్టారు.

ఈ ప్రమాదంలో సంజనాతోపాటు ఆమె తల్లీ తీవ్రంగా గాయపడింది. దీంతో వారిని కామినేని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి కారణమైన ముగ్గురు యువకులు బెయిల్ పై విడుదలయ్యారు. దాంతో వారి బెయిల్ రద్దు చేయాలని హయత్ నగర్ పోలీసులను సంజనా తల్లిదండ్రులు కోరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement