డీజిల్‌పై రూ.4-5 పెంచండి | Parekh report likely to recommend Rs 5/L diesel price hike | Sakshi
Sakshi News home page

డీజిల్‌పై రూ.4-5 పెంచండి

Oct 29 2013 5:18 AM | Updated on Sep 2 2017 12:04 AM

డీజిల్ రేట్లను లీటరుకు రూ. 4 నుంచి 5 తక్షణమే పెంచాలని కిరిట్ పారిఖ్ కమిటీ ప్రభుత్వానికి సూచించింది. పారిఖ్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ తన నివేదికను బుధవారం ప్రభుత్వానికి సమర్పించనుంది.

న్యూఢిల్లీ: డీజిల్ రేట్లను లీటరుకు రూ. 4 నుంచి 5 తక్షణమే పెంచాలని కిరిట్ పారిఖ్ కమిటీ ప్రభుత్వానికి సూచించింది.  పారిఖ్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ తన నివేదికను బుధవారం ప్రభుత్వానికి సమర్పించనుంది. ఈ నివేదికలో డీజిల్, కిరోసిన్, వంటగ్యాస్‌లో ఏకరూప ధరల విధానాన్ని కొనసాగించాలని కమిటీ సూచించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. డీజిల్ రేటును వెంటనే పెంచి, ఆపై మిగిలిన సబ్సిడీ భారాన్ని దించుకునేందుకు నెలకు లీటర్‌పై రూపాయి చొప్పున పెంచుతూ పోవాలని కమిటీ ప్రభుత్వానికి సూచించింది. పెట్రోలు ఉత్పత్తుల ధరలను నియంత్రణలో ఉంచడానికి ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలను కొనసాగించాలని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement