టోకు మార్కెట్‌లో ధరల పెరుగుదల ప్రభావం చిల్లర మార్కెట్‌పై పడింది. కిలో ఉల్లిపాయలను చిల్లర వ్యాపారులు రూ. 65కి విక్రయిస్తున్నారు.
నాసిక్: టోకు మార్కెట్‌లో ధరల పెరుగుదల ప్రభావం చిల్లర మార్కెట్‌పై పడింది. కిలో ఉల్లిపాయలను చిల్లర వ్యాపారులు రూ. 65కి విక్రయిస్తున్నారు. దీంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు దీపావళి తర్వాత టోకు మార్కెట్‌కు ఉల్లిపాయ ల రాక కూడా బాగా తగ్గింది. గతవారం కిలో ఉల్లిపాయలు రూ.50 పలికిన సంగతి విది తమే. గడిచిన తొమ్మిదిరోజుల వ్యవధిలో జిల్లాలోని లసల్గావ్‌లోని వ్యవసాయ మార్కెట్‌లో ఉల్లిపాయల ధరలు రూ. 56 శాతంమేర పెరి గాయి. గత నెల 31వ తేదీన క్వింటాల్ ఉల్లిపాయలు రూ. 3,200గా ఉండగా అది ఈ నెల ఎనిమిది నాటికి రూ.5,000లకు చేరుకుంది. ఇందుకు కారణం ఈ మార్కెట్‌కు ఉల్లిపాయల రాక గణనీయంగా తగ్గిపోవడమే.