ప్రైవేట్ ఆస్పత్రులపై అధికారుల దాడులు | officers rides on private hospitals | Sakshi
Sakshi News home page

ప్రైవేట్ ఆస్పత్రులపై అధికారుల దాడులు

Nov 27 2013 2:08 AM | Updated on Sep 2 2017 1:00 AM

పట్టణ పరిధిలోని పలు క్లినిక్‌లు, ప్రైవేట్ ఆస్పత్రులపై వైద్యాధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య విద్య అభ్యసించకుండానే చికిత్సలు నిర్వహిస్తున్న పలువురిని హెచ్చరించి, ఆస్పత్రులను మూసివేయించారు.

 దొడ్డబళ్లాపురం, న్యూస్‌లైన్ :
 పట్టణ పరిధిలోని పలు క్లినిక్‌లు, ప్రైవేట్ ఆస్పత్రులపై వైద్యాధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య విద్య అభ్యసించకుండానే చికిత్సలు నిర్వహిస్తున్న పలువురిని హెచ్చరించి, ఆస్పత్రులను మూసివేయించారు.
 
 పాత బస్టాండ్ పరిసరాల్లో ఉన్న మంజునాథ్ క్లినిక్, మధు క్లినిక్, విజయ క్లినిక్, డాక్టర్ బిరాదార్ క్లినిక్, ఆనందమయి క్లినిక్‌లపై జిల్లా నోడల్ అధికారి డాక్టర్ అశోక్, తాలూకా వైద్యాధికారి షర్మిళ హెడే, పోలీసులు దాడులు నిర్వహించారు. నకిలీ సర్టిఫికెట్లు పొంది వైద్యం చేస్తున్నట్లు గుర్తించిన అధికారులు వారిని హెచ్చరించి వదిలేశారు. క్లినిక్‌లను మూసి వేయించారు. ఆనందమయి క్లినిక్‌లో డాక్టర్  ఆయూష్ ప్రమాణ పత్రం పొంది అలోపతి వైద్యం చేస్తున్నట్లు గుర్తించారు. ఈ క్లినిక్‌లో నకిలీ ధ్రువీకరణ పత్రాలు లభ్యమయ్యాయని, దీనిపై సమగ్ర విచారణ అనంతరం పూర్తి వివరాలు అందిస్తామని టీహెచ్‌ఓ షర్మిళ హెడే తెలిపారు.
  క్లినిక్‌ను సీజ్ చేసి సిబ్బందిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. కాగా, నకిలీ వైద్యులుగా తేలిన వారిపై ఎలాంటి కేసులు నమోదు చేయకుండా హెచ్చరించి వదిలేయడంపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement