లాక్‌డౌన్‌: రోడ్డునపడ్డ కమెడియన్‌ | Odia Comedian Black Ravi Forced to Sell Vegetables | Sakshi
Sakshi News home page

కూరగాయలు అమ్ముతున్న కమెడియన్‌

Apr 23 2020 8:54 PM | Updated on Apr 23 2020 8:54 PM

Odia Comedian Black Ravi Forced to Sell Vegetables - Sakshi

కరోనా వైరస్‌ నివారణ చర్యల్లో భాగంగా అమలు చేస్తున్న లాక్‌డౌన్‌తో ఒడిశాలో ప్రముఖ కమెడియన్‌ రోడ్డున పడ్డాడు.

భువనేశ్వర్‌: కరోనా వైరస్‌ నివారణ చర్యల్లో భాగంగా అమలు చేస్తున్న లాక్‌డౌన్‌తో ఒడిశాలో ప్రముఖ కమెడియన్‌ రోడ్డున పడ్డాడు. ప్రముఖ ఒడియా సినీ హాస్యనటుడు రవి కుమార్‌(నల్ల రవి) పొట్టకూటి కోసం ఇంటింటికీ తిరిగి కూరగాయలు అమ్ముతున్నాడు. లాక్‌డౌన్‌తో సినిమా షూటింగ్‌లు ఆగిపోవడంతో పాటు అతడి కామెడీ షోలు అన్నీ రద్దు కావడంతో పూటగడవ ప్రతిరోజు ద్విచక్ర వాహనంపై తిరుగుతూ కూరగాయలు విక్రయిస్తున్నాడు.

‘పెద్ద కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత నాపై ఉండటంతో కూరగాయలు అమ్మాలని నిర్ణయించుకున్నాను. దీని కంటే ముందు కోడిగుడ్లు దుకాణం మొదలు పెట్టాను. నా కుటుంబానికి సరిపోయేంత ఆదాయం రాకపోవడంతో మానేసి ఇప్పుడు కూరగాయాలు విక్రయిస్తున్నాను’ అని రవికుమార్‌ ఏఎన్‌ఐ వార్తా సంస్థతో చెప్పాడు. అతడు 30పైగా ఒడియా సినిమాల్లో నటించాడు. కరోనా మహమ్మారిపై పోరులో భాగంగా ప్రజలను చైతన్యవంతులను చేయడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నట్టు రవికుమార్‌ తెలిపాడు.

చదవండి: లాక్‌డౌన్‌ పెనాల్టీలపై కేంద్రం స్పష్టత 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement