నల్లధనం, అవినీతిని కక్కిస్తారా? : నారాయణ | Narayana comments on Modi government | Sakshi
Sakshi News home page

నల్లధనం, అవినీతిని కక్కిస్తారా? : నారాయణ

Feb 14 2017 3:15 AM | Updated on Apr 3 2019 5:16 PM

నల్లధనం, అవినీతిని కక్కిస్తారా? : నారాయణ - Sakshi

నల్లధనం, అవినీతిని కక్కిస్తారా? : నారాయణ

‘‘దేశంలో పెరుగుతున్న నల్లధనం, అవినీతిని కక్కిస్తారా..?

ఖమ్మం సహకారనగర్‌: ‘‘దేశంలో పెరుగుతున్న నల్లధనం, అవినీతిని కక్కిస్తారా..? ఈ రెండింటిలో మోదీ ప్రభుత్వం ఏది చేసినా సంతోషమే.. అదానీ, అంబానీలంతా ఆయన పక్కనే ఉన్నారు’’ అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్రంలో మోదీని విమర్శిస్తే దేశద్రోహులంట, రాష్ట్రం లో కేసీఆర్‌ను విమర్శిస్తే తెలంగాణ ద్రోహులుగా ముద్రవేసే ప్రయత్నం జరగటం సరికాదన్నారు. ప్రస్తుత పాలన కంటే కాంగ్రెస్‌ పాలనే నయం అనేలా కన్పిస్తుందన్నారు.

సమైక్యాంధ్రకు మద్దతు పలికిన తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌లకు మంత్రి పదవులు దక్కగా, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన కోదండరాంసహా కమ్యూనిస్టు పార్టీల నేతలకు విమర్శలు మిగిలాయన్నారు. మహిళా సాధికారిత సదస్సుకు ఎమ్మెల్యే రోజాను అనుమతించిఉంటే బాగుండేదని, అలా చేయకపోవటం వల్లే ఆమె హైలెట్‌ అయిందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement