నాడప్రభు కెంపేగౌడ జయంతి సంబరాలను శనివారం ఉదయం బృ హత్ బెంగళూరు మహా నగర పాలికె ....
బెంగళూరు(బనశంకరి) : నాడప్రభు కెంపేగౌడ జయంతి సంబరాలను శనివారం ఉదయం బృ హత్ బెంగళూరు మహా నగర పాలికె (బీబీ ఎంపీ) కార్యాలయం ముందు ఉన్న కెంపేగౌడ విగ్రహానికి మాలార్పణ చేయడం ద్వారా మేయర్ శాంతకుమారి ప్రారంభించారు. ప్రతి ఏటా కరగ మూడవరోజున కెంపేగౌడ జయంతిని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
మేక్రిసర్కిల్, సుంకేనహళ్లి, కోరమంగళ, లాల్‌బాగ్‌లో ఉన్న నాలుగు దిక్కుల సరిహద్దు గోపురాలకు ఆయా ప్రాంతాల స్థానిక కార్పొరేటర్లు నేతృత్వంలో కెంపేగౌడ జ్యోతిని తీసుకువచ్చి కేంద్ర కార్యాలయానికి చేరుకోగా మేయర్ శాంతకుమారి జ్యోతిని స్వీకరించారు. కెంపేగౌడ జ్యోతిని వివిధ జానపద కళాబృందాలతో నాటి వైభవాన్ని చాటుతూ నిర్వహించిన ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బీబీఎంపీ కేంద్ర కార్యాలయ ఆవరణలో పండుగ వాతావరణం నెలకొంది.