మాతృభాష అమ్మలాంటిది | Mother language ammalantidi | Sakshi
Sakshi News home page

మాతృభాష అమ్మలాంటిది

Sep 8 2013 1:02 AM | Updated on Sep 1 2017 10:32 PM

మాతృభాష అమ్మలాంటిదని, అలాంటి భాషను మనం మరువరాదని ప్రముఖ కన్నడ కవి విమర్శకుడు డాక్టర్ ఎన్‌ఎస్. లక్ష్మీనారాయణభట్ అన్నారు.

బనశంకరి,న్యూస్‌లైన్ :   మాతృభాష అమ్మలాంటిదని, అలాంటి భాషను మనం మరువరాదని ప్రముఖ కన్నడ కవి విమర్శకుడు డాక్టర్ ఎన్‌ఎస్. లక్ష్మీనారాయణభట్ అన్నారు. శనివారం బన శంకరి మూడవస్టేజ్‌లోని ఐటీఐ లేఔట్‌లో ఉన్న శ్రీకృష్ణ విద్యాసంస్థలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవం కార్యక్రమాన్ని లక్ష్మీనారాయణభట్ ప్రారంభించి మాట్లాడుతూ... వేదిక బృహస్పతి లాంటిదైతే, సభ సరస్వతి వంటిదన్నారు. పిల్లలకు అమ్మ మొదటి గురువు అని, అమ్మకు పిల్లలపై ఉన్న మమకారం వర్ణించలేమన్నారు.

మాతృభాషతో పాటు ఇతర భాషల పట్ల అభిమానం కలిగి ఉండాలని విద్యార్థులకు సూచించారు. ఉపాధ్యాయులపై విద్యార్థులు గౌరవభావం పెంపొందించుకోవాలని సూచించారు. ఉత్తమ సమాజాన్ని నిర్మించడంలో గురువుల పాత్ర ఎంతో కీలకమన్నారు. అనంతరం విధాన  పరిషత్ సభ్యుడు ఆర్‌వీ.వెంకటేశ్ మాట్లాడుతూ... సమాజంలో విద్య కీలకపాత్ర పోషిస్తుందని, ఉపాధ్యాయులు ఇష్టంతో విద్యార్థులకు బోధన చేయాలన్నారు.

అనంతరం శ్రీకృష్ణ విద్యసంస్థల చైర్మన్ డాక్టర్ ఎం.రుక్మాంగదనాయుడు మాట్లాడుతూ... ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తనకు గురువు అయిన డాక్టర్ ఎన్‌ఎస్.లక్ష్మీనారాయణభట్‌ను సన్మానించడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా  శ్రీకృష్ణ విద్యాసంస్థ ఉపాధ్యాయలను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో భాగంగా చిన్నారి ఖుషి సర్వేపల్లి రాధాకృష్ణన్‌పై చేసిన ప్రసంగం అహుతులను విశేషంగా ఆకట్టుకుంది. కార్యక్రమంలో శ్రీకృష్ణ విద్యాసంస్థల వైస్ చైర్మన్ జలజానాయుడు, శ్రీకృష్ణ విద్యాసంస్థ డెరైక్టర్ మనోహర్, డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ శాంతలా, సైన్స్ విభాగం ప్రిన్సిపాల్ గోపాల్, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement