రేషన్‌ కోళ‍్ల ఫారాలకు వెళ్లింది నిజమే: మంత్రి | minister etela rajender speaks on civil supplies | Sakshi
Sakshi News home page

రేషన్‌ కోళ‍్ల ఫారాలకు వెళ్లింది నిజమే: మంత్రి

Mar 25 2017 2:32 PM | Updated on Aug 11 2018 6:42 PM

రేషన్‌ కోళ‍్ల ఫారాలకు వెళ్లింది నిజమే: మంత్రి - Sakshi

రేషన్‌ కోళ‍్ల ఫారాలకు వెళ్లింది నిజమే: మంత్రి

మా ప్రభుత్వం వచ్చిన తరువాత పౌర సంబంధాల శాఖ ప్రజా సంబంధాలు కలిగిన శాఖగా మారిందని ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ అన్నారు.

హైదరాబాద్‌: మా ప్రభుత్వం వచ్చిన తరువాత పౌర సంబంధాల శాఖ ప్రజా సంబంధాలు కలిగిన శాఖగా మారిందని ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ అన్నారు. ఆయన శనివారం శాసన మండలిలో మాట్లాడుతూ..‘‘ లబ్ది దారులకు అందాల్సిన రేషన్‌ బియ్యం గతంలో కోళ్ల ఫారాలకు తరలిపోయిన మాట వాస్తవం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితిని అరికట్టాం. ప్రస్తుతం ప్రతి పాఠశాలలో సన్నబియ్యం పెడుతున్నాం. గతంలో ఊళ్లో ఒకటి, హైదరాబాద్‌లో ఒకటి రెండు రేషన్‌ కార్డులు ఉండేవి. మా హయంలో దాన్ని అరికట్టాం. అడిగిన వారందరికీ బియ్యం అందజేస్తున్నాం. ఈ పాస్‌ యంత్రాల ద్వారా రేషన్‌ అక్రమాలను అడ్డుకున్నాం. త్వరలోనే రాష్ట్రమంతటా ఈ పాస్‌ యంత్రాల ద్వారా రేషన్‌ విక్రయాలు జరుపుతాం. 

Advertisement
 
Advertisement
Advertisement