ప్రభుత్వాస్పత్రుల్లో సరైన వైద్య సేవలు అందకపోవడంతో తప్పని పరిస్థితుల్లో ప్రైవేట్ ఆస్పత్రులను రోగులు ఆశ్రయిస్తున్నారని శాసనసభ ఉపాధ్యక్షుడు ఎన్.హెచ్.శివశంకరరెడ్డి అన్నారు.
శిడ్లఘట్ట, న్యూస్‌లైన్ : ప్రభుత్వాస్పత్రుల్లో సరైన వైద్య సేవలు అందకపోవడంతో తప్పని పరిస్థితుల్లో ప్రైవేట్ ఆస్పత్రులను రోగులు ఆశ్రయిస్తున్నారని శాసనసభ ఉపాధ్యక్షుడు ఎన్.హెచ్.శివశంకరరెడ్డి అన్నారు. పట్టణంలో నూతనంగా ఏర్పాటైన మానస ఆస్పత్రి భవనాలను ఆయన ఆదివారం ప్రారంభించి, మాట్లాడారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేదలకు సరైన వైద్యం అందడం లేదని స్పష్టం చేశారు. ఈ పరిస్థితుల్లో గ్రామీణులకు మెరుగైన వైద్యం అందిస్తున్న మానస గ్రూప్ ఆఫ్ ఆస్పత్రుల వంటి సంస్థలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు.
రాష్ట్రంలో వైద్య విద్యకు ప్రాధాన్యతనివ్వడంలో భాగంగా జిల్లాకొక వైద్య విద్య కాలేజీల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని తెలిపారు. చిక్కబళ్లాపురం జిల్లాలోనూ వైద్యకీయ కాలేజీ ఏర్పాటు అవుతుందని అన్నారు. ప్రతి తాలూకా కేంద్రంలోనూ డయాలసిస్ కేంద్రం స్థాపనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజణ్ణ, మానస సమూహ ఆస్పత్రుల వ్యవస్థాపకుడు హెచ్.ఎన్.సుబ్రహ్మణ్యం, కె.పి.శ్రీనివాసమూర్తి, డాక్టర్ పి.ఎన్.గోవిందరాజు, నేత్ర వైద్యుడు డాక్టర్ నరపత్ సోలంకి, కౌన్సిలర్ చిక్కమునియప్ప, అప్సర్ పాషా, బంక్ మునియప్ప, హనుమంతరెడ్డి, డాక్టర్ శశిధర్, డాక్టర్ మధుకర్, డాక్టర్ నరసారెడ్డి, డాక్టర్ శ్రీకాంత్, బ్యాటరాయశెట్టి, రమేష్, నారాయణస్వామి, శివప్రసాద్ పాల్గొన్నారు.