మూడో పెళ్లి కావాలా ? | Looking for a third marriage? | Sakshi
Sakshi News home page

మూడో పెళ్లి కావాలా ?

Aug 31 2016 1:46 AM | Updated on May 25 2018 12:54 PM

మూడో పెళ్లి కావాలా ? - Sakshi

మూడో పెళ్లి కావాలా ?

ఈపాటికే రెండు పెళ్లిళ్లు చేసుకుని డబ్బు కోసం మూడో పెళ్లికి సిద్ధమైన వ్యక్తికి స్థానికులు పట్టుకుని దేహశుద్ధి ...

పెళ్లి కుమారుడికి రెండో భార్య బంధువుల దేహశుద్ధి
డబ్బు కోసం మూడో పెళ్లికి యత్నం

 

తుమకూరు : ఈపాటికే రెండు పెళ్లిళ్లు చేసుకుని డబ్బు కోసం మూడో పెళ్లికి సిద్ధమైన వ్యక్తికి స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన సంఘటన తుమకూరు నగరంలోని జయనగర పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాలు... మధుగిరి తాలూకాలోని సంకపురం గ్రామానికి చెందిన మహ్మద్‌పీర్ తుమకూరు నగరంలోని శాంతినగరకు చెందిన తబుసుమ్ బానును మూడో పెళ్లి చేసుకోడానికి సిద్ధమయ్యాడు. అంతకు ముందే నిశ్చితార్థం జరగడంతో మంగళవారం న గరంలోని మదర్ షాదీ మహలల్‌లలో పెళ్లి జరగాల్సి ఉంది.

ఇప్పటికే రూ. 60 వేల కట్నంతో పాటు ఇంటికి కావాల్సిన వస్తువులను కూడా పెళ్లి కుమార్తె వారు అందజేశారు. విషయం తెలుసుకున్న రెండో భార్య బంధువులు అక్కడికి చేరుకుని మహ్మద్ పీర్‌ను పట్టుకుని చితకబాదారు. అనంతరం రోడ్డుపైకి తీసుకువచ్చి జయనగర పోలీసులకు అప్పగించారు. ఇతనికి ఇప్పటికే రెండు పెళ్లిళ్లు జరిగినట్లు తమకు తెలియదని తబుసుమ్ బంధువులు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement