మూడు నెలలుగా చూస్తున్నా.. అతను రావడం లేదు

Kolkata Woman Was Cheated By Person In Karnataka - Sakshi

దొడ్డబళ్లాపురం : ప్రేమించానని రాష్ట్రం కాని రాష్ట్రం తీసుకువచ్చిన ప్రియుడు ప్రియురాలిని అర్ధాంతరంగా వదిలి వెళ్లిపోగా, ఎప్పటికయినా తన ప్రియుడు రాకపోతాడా అని ఆ యువతి గత మూడు నెలలుగా అదే చోట వేచి చూస్తున్న సంఘటన దేవనహళ్లి తాలూకా కారళ్లిలో వెలుగు చూసింది. కారళ్లి ప్రసిద్ధ నందికొండ వద్ద ఉంది. కారళ్లి గ్రామం పరిసరాల్లో గత మూడు నెలలుగా తిరుగుతున్న యువతి బేకరి, దుకాణాలు, బస్టాండులో సేదతీరుతూ, రోడ్డుకు అటూ, ఇటూ తిరుగుతూ, రాత్రి పూట స్థానిక బ్యాంకు ముందు పడుకుంటూ కాలం గడుపుతోంది. మొదట ఆమెను మానసిక అస్వస్థురాలు­గా భావించిన గ్రామస్తులకు ఇటీవలే ఆమె విషాద ప్రేమ కథ తెలిసింది. కన్నడ భాష రాకపోవడంతో హిందీ తెలిసిన గ్రామస్తురాలయిన హసీనా అనే మహిళతో మాట్లాడించి వివరాలు తెలుసుకున్నారు.

కోల్‌కతాకు చెందిన ఆ యువతిని అజయ్‌ అనే యువకుడు ప్రేమించాడు. ఇక్కడే నివసిద్దామని కారళ్లి వద్దకు తీసుకువచ్చి ఒక ఇంట్లో కొన్ని రోజులు ఉంచాడు. తరువాత కోల్‌కతా వెళ్లిపోదామని చెప్పి తీసికెళ్లి మార్గం మధ్యలో ఎక్కడో వదిలేసి వెళ్లిపోయాడు. అయితే ప్రియుడిపై ప్రేమను, నమ్మకాన్ని చంపుకోలేని యువతి ఎప్పటికయినా ప్రియుడు తనను వెదుక్కుంటూ ఇక్కడికే వస్తాడని ఆశతో కారళ్లి వద్దే వీధుల్లో నివసిస్తోంది. కథ విన్న గ్రామస్తులు ఆమె భద్రత కోసం పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలానికి వచ్చిన పోలీసులు ఆమెను బలవంతం మీద మహిళా సాంత్వన కేంద్రానికి తరలించి రక్షణ కల్పించారు. ఆ యువతి ప్రస్తుతం మానసికంగా బాగా కుంగిపోయిందని పోలీసులు చెబుతున్నారు.  

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top