ఈ జడ్జి గ్రేట్‌

Judge Challans To Without Helmet Riders In Karnataka - Sakshi

దొడ్డబళ్లాపురం: సాధారణంగా హెల్మెట్లు ధరించకుండా ప్రయాణించేవారికి ట్రాఫిక్‌ పోలీసులు ఫైన్‌లు వేస్తుంటారు.లేదా హెల్మెట్‌ లేకుండా ప్రయాణిస్తే జరిగే నష్టాలపై అవగాహన కల్పిస్తారు. అయితే ఈ పనిని ఒక న్యాయమూర్తి చేయడం విశేషం. ఈ సంఘటన దావణగెరె జిల్లా హరపనహళ్లి పట్టణంలో చోటుచేసుకుంది. రోడ్డు భద్రతా వారోత్సవాల నేపథ్యంలో హరపనహళ్లి కోర్టు జడ్జీ మంజుళ శివప్ప తానే స్వయంగా రోడ్డు మధ్యలో నిలబడి హెల్మెట్‌ లేకుండా ప్రయాణిస్తున్న వారిని నిలిపి జరిమానాలు విధించారు. రోడ్డు భద్రత గురించి వారికి వివరించారు. జడ్జి చొరవను అందరూ ప్రశంసించారు.  

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top