జీవన్‌రెడ్డికి ఫోన్ చేయించిన మంత్రి.. | jeevan reddy visits jagtial govt office | Sakshi
Sakshi News home page

జీవన్‌రెడ్డికి ఫోన్ చేయించిన మంత్రి..

Oct 12 2016 8:29 AM | Updated on Sep 4 2017 5:00 PM

జగిత్యాల జిల్లా కలెక్టరేట్‌ను మంత్రి ఈటల రాజేందర్ పరిశీలించేందుకు సోమవారం వచ్చారు.

కలెక్టరేట్ చేరుకుని మంత్రితో మాట్లాడిన ఎమ్మెల్యే
 
జగిత్యాల అర్బన్ : జగిత్యాల జిల్లా కలెక్టరేట్‌ను మంత్రి ఈటల రాజేందర్ పరిశీలించేందుకు సోమవారం వచ్చారు. అయితే జిల్లాగా ఏర్పడుతున్న జగిత్యాలలో కార్యాలయూలు ఏర్పాటు చేస్తున్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి వాటిని సందర్శించిన దాఖలాలు లేవు. దీంతో స్పందించిన మంత్రి జీవన్‌రెడ్డికి ఫోన్ చేయమని డీఎస్పీ రాజేంద్రప్రసాద్‌కు సూచించారు. డీఎస్పీ ఫోన్‌లో మాట్లాడగా..వెంటనే జీవన్‌రెడ్డి కలెక్టరేట్‌కు చేరుకుని జిల్లా ఏర్పాటుకు సంబంధించిన విశేషాలను అడిగి తెలుసుకున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement