ప్రభుత్వ ఎగ్జిబిషన్ ఏర్పాటుకు చర్యలు | Government Exhibition Establish measures | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఎగ్జిబిషన్ ఏర్పాటుకు చర్యలు

Dec 24 2013 2:27 AM | Updated on Sep 2 2017 1:53 AM

వేలూరు కోటై మైదానంలో ప్రభుత్వ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నందగోపాల్ అధికారులను ఆదేశించారు.

 వేలూరు, న్యూస్‌లైన్: వేలూరు కోటై మైదానంలో ప్రభుత్వ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నందగోపాల్ అధికారులను ఆదేశించారు. ఆయన సోమవారం వేలూరు కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించా రు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఎగ్జిబిషన్‌లో కార్పొరేషన్, అటవీ, సమాచార, పర్యాటక శాఖలతో పాటు ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అదే విధంగా ఎగ్జిబిషన్‌కు వచ్చే వారికి బస్సు సౌకర్యం కల్పించాలన్నారు. ఈ ఎగ్జిబిషన్‌ను ఇది వరకే తిరువణ్ణామలై జిల్లాలో నిర్వహించి విజయవంతం చేశారని గుర్తుచేశారు. వేలూరు జిల్లాలో నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. అనంతరం ఎగ్జిబిషన్ ఏర్పాటుకు భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి బలరామన్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రాజెక్టు అధికారి శ్రీనివాసన్, జిల్లాలోని అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement