మెయిన్‌ డ్రాకు నందగోపాల్‌ జోడీ | Nandagopal pair of the main draw | Sakshi
Sakshi News home page

మెయిన్‌ డ్రాకు నందగోపాల్‌ జోడీ

Jan 31 2018 1:27 AM | Updated on Jan 31 2018 1:27 AM

Nandagopal pair of the main draw - Sakshi

నందగోపాల్‌

న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో తెలుగు క్రీడాకారులు నందగోపాల్, కృష్ణప్రసాద్‌ తమ భాగస్వాములతో కలిసి పురుషుల డబుల్స్‌లో మెయిన్‌ డ్రా ఈవెంట్‌కు అర్హత సాధించారు. మంగళవారం జరిగిన  క్వాలిఫయింగ్‌ పోటీల్లో కె.నందగోపాల్‌–ఫ్రాన్సిల్‌ ఆల్విన్‌ (భారత్‌) జంట 21–13, 21–13తో దీపేశ్‌ ధమి–రత్నజిత్‌ తమంగ్‌ (నేపాల్‌) ద్వయంపై గెలుపొందగా, కృష్ణప్రసాద్‌–ధ్రువ్‌ కపిల జోడీ 21–11, 21–15తో భారత్‌కే చెందిన సిద్ధార్థ్‌–ప్రేమ్‌ సింగ్‌ చౌహాన్‌ జంటపై విజయం సాధించింది.

పురుషుల సింగిల్స్‌లో సిరిల్‌ వర్మ క్వాలిఫయింగ్‌లోనే వెనుదిరిగాడు. కార్తీకేయ్‌ గుల్షన్‌ కుమార్‌ 21–17, 15–21, 21–7తో సిరిల్‌ను ఓడించాడు. బుధవారం నుంచి మెయిన్‌ డ్రా మ్యాచ్‌లు జరుగుతాయి. 

Advertisement
 
Advertisement
Advertisement